మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకుందీ చిత్రం.
సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. టోటల్ రన్ లో ఈ చిత్రం సుమారు రూ.20 కోట్లు వరకూ కలెక్షన్స్ సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
ఈ నేపథ్యంలో థియేటర్లలో అలరించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం కమిటీ కుర్రోళ్ళు చిత్రం త్వరలో ఓటీటీ లోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ వేదికగా ప్రసారం కానుంది. సెప్టెంబర్‌లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడికానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. సో.. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారికి ఇంట్లోనే వీక్షించే అవకాశం ఉంది.
కాగా కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో 11మంది కొత్తవారు నటించడం విశేషం. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక కమిటీ కుర్రోళ్ళు సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌లోనే చూసి ఆదరించాలని శాటిలైట్ మరియు ఓటీటీ హక్కులను ఇంకా ఎవరికీ ఇవ్వలేదని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: