టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. గతంలో ఆయన హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్ గా ఇది రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ సింహ సైడ్ కిక్‌గా కమెడియన్ సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా విడుదలవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మార్కెట్‌లో హైప్ తెచ్చుకున్న మత్తు వదలారా 2 నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్‌కు మూవీ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఈ సినిమాపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా ప్రస్తుతం రాజమౌళి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మత్తు వదలరా 2 గురించి డైరెక్టర్ రాజమౌళి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “హి హి హి.. హి టీమ్… మా బాయ్స్ మత్తు వదలరా 2 తో తిరిగి వస్తున్నారు. టీజర్ లోని డైలాగ్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌తో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 13న ఈ మూవీ టికెట్స్ తస్కరించేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు” అని పేర్కొన్నారు. అయితే హీరో శ్రీ సింహ రాజమౌళి సోదరుడు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి తనయుడన్న విషయం తెలిసిందే.
కాగా మత్తు వదలరా 2లో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. అలాగే కమెడియన్ సత్య కీలక పాత్రలో నటిస్తుండగా.. సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూరుస్తుండగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: