బ్లాక్ బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “అందరం ఒకే ఫేజ్ లో వున్నాం, సేమ్ హ్యుమర్ తో వస్తున్నాం. ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన బెస్ట్ టీం ఇది. ఇది చాలా ఫన్ జర్నీ. మూవీ చూసినప్పుడు మీకూ అర్ధమౌతోంది. ఈ సినిమా లో ఓ పాట రాయడంతో పాటు పాడాను. అలాగే కొరియోగ్రఫీ కూడా చేశాను. త్వరలోనే పాట వస్తుంది. ఆడియన్స్ సినిమాని ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: