యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ – చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఇక తండేల్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపించి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అలాగే సాయి పల్లవిని ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన సత్య మేకింగ్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది.
ఈ నేపథ్యంలో ఇటీవలే విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలలో షూటింగ్ ముగించుకున్న తండేల్ టీం తాజాగా హైదరాబాద్ చేరుకుంది. ఈ క్రమంలో సినిమాలో కీలకమైన ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా నగర శివారులో నిర్మించిన ఓ భారీ సెట్‌లో దీనిని చిత్రీకరిస్తున్నారు. అయితే ఇది జాతర నేపథ్యంలో వచ్చే పాటగా తెలుస్తోంది. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కథ రీత్యా శ్రీకాకుళం నేపథ్యం ఉండటంతో అక్కడి జాతర్లలో ఆడిపాడే పేరుమోసిన కళాకారులను రప్పించారు. అలాగే దాదాపు 900 మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. ఇక ఈ పాట కోసం శ్రీకాకుళం వాతావరణాన్ని తలపించేలా వేసిన భారీ సెట్, పాల్గొన్న కళాకారులు అన్నింటికీ కలిపి సుమారు 3 కోట్లు వరకు ఖర్చు అయిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా తండేల్ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: