మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రెండు సూపర్ హిట్స్‌కి సీక్వెల్స్

Producer Ashwini Dutt Announces Sequels For Indra and Jagadeka Veerudu Athiloka Sundari

మెగాస్టార్ అభిమానులకు శుభవార్త వినిపించారు ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్స్ అయిన రెండు సినిమాలకు ఆయన సీక్వెల్స్ అనౌన్స్ చేశారు. ఇటీవలే రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ఆయన తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి గుర్తుండేవుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి 69వ బర్త్ డే సందర్భంగా 2002లో వచ్చిన ‘ఇంద్ర’ సినిమాను రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 22 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హ్యూజ్ సక్సెస్‌ అయింది. దీనిని పురస్కరించుకుని మెగాస్టార్ ఇంట మూవీ టీమ్‌కు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ కీలక ప్రకటన చేశారు.

ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బి.గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, చిన్ని కృష్ణ సహా అశ్వనీదత్ హాజరయ్యారు. అందరిని శాలువాలతో సత్కరించిన చిరు నిర్మాత అశ్వినీ దత్ కు ప్రత్యేకంగా పాంచజన్యాన్ని (శంఖం) బహుమతిగా ఇచ్చారు. కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోలో కృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ పాంచజన్యాన్ని పూరిస్తున్నట్టు ఉండటాన్ని మనం గమనించొచ్చు.

ఈ నేపథ్యంలో అశ్వినీ దత్ మాట్లాడుతూ.. మెగాస్టార్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ అయిన ‘ఇంద్ర’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రాలకు సీక్వెల్స్ తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ రెండు సీక్వెల్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపిన ఆయన.. ఈ సీక్వెల్స్ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అశ్వినీ దత్ వ్యాఖ్యలపై మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వంభరలో ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. కునాల్ కపూర్, సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. కాగా విశ్వంభర 2025లో జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.