చూడాలని వుంది సినిమాకు 26 ఏళ్లు.. మెగాస్టార్ కెరీర్‌లోనే స్పెషల్ మూవీ

Megastar Chiranjeevi's Choodalani Vundi Celebrating 26 Years

మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వున్నాయి. అలాంటివాటిలో ఒకటి ‘చూడాలని వుంది’. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998 ఆగస్టు 27న విడుదలై ఘనవిజయం సాధించింది. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ నిర్మించారు. నేటితో ఈ సినిమా రిలీజై 26 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో దీనిపై స్పెషల్ పోస్ట్ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే అల్లు రామలింగయ్య, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మాజీ, వేణు మాధవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం, ఛోటా కె. నాయుడు ఛాయాగ్రహణం సినిమాను మరో లెవెల్‌లో నిలబెట్టాయి. ఇంకా రాఘవ లారెన్స్, సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ, దివాకర్ బాబు రాసిన డైలాగ్స్ ప్లస్ అయ్యాయి.

కథ ప్రకారం, సినిమాలో చాలాభాగం కలకత్తాలో చిత్రీకరించారు. రామకృష్ణ (చిరంజీవి) అనే వ్యక్తి కలకత్తాకు కొత్తగా రావడంతో కథ మొదలవుతుంది. బెంగాలీ భాష తెలియక ఇబ్బంది పెడుతూ ఒక చిన్న అపార్టుమెంటుకు చేరుకున్న ఆయన.. అక్కడే అద్దె కట్టకుండా ఓ గదిలో ఉంటున్న పద్మావతి (సౌందర్య) అనే తెలుగు అమ్మాయితో కలిసి వుంటాడు. ప్రేమలో మోసపోయిన యువతిగా ఆమె కనిపిస్తుంది.

సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. ముఖ్యంగా చిరు కామెడీ టైమింగ్ అదుర్స్. మరో హీరోయిన్ అంజలా ఝవేరితో లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు హార్ట్ టచింగ్ గా వుంటాయి. ఈ చిత్రానికి ముందువరకూ చిరంజీవి సీరియస్ టైప్ మూవీస్ చేసి వుండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది. అలాగని యాక్షన్ ఉండదని కాదు. మరోవైపు విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ అదరగొట్టాడు. ‘వాడు సామాన్యుడు కాడు’ అని నవరసాలతో ఆయన చెప్పే డైలాగ్ నభూతో.. అన్నట్టుగా వుంటుంది.

కాగా చూడాలని వుంది సినిమాకు మణిశర్మ మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు. ‘యమహా నగరి’, ‘అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ముద్దు’, ‘మనస్సా ఎప్పుడొచ్చావ్’.. వంటి పాటలకు ఆయన అందించిన బాణీలు నాడు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అలాగే ‘ఓ మారియ ఓ మారియ’, ‘సింబలే సింబలే’ సాంగ్స్ విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంటాయి.

ఇక ఈ సినిమాలోని ‘రామ్మా చిలకమ్మా’ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పాట బాలీవుడ్ స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ కు తెలుగులో మొదటి పాట కావడం విశేషం. దీనికి వచ్చిన గుర్తింపుతో ఆ తర్వాత ఆయన తెలుగులో కొన్ని వందల పాటలు ఆలపించారు. కాగా ఈ సినిమాకుగానూ మణిశర్మకు నంది పురస్కారంతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా దక్కింది. మొత్తానికి చిరు కెరీర్ లో చూడాలని వుంది ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

కాగా చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. కునాల్ కపూర్, సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే యేడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.