సరిపోదా శనివారం సినిమా షూటింగ్ సమయంలో కొన్ని మ్యాజిక్‌లు జరిగాయని తెలిపారు ప్రముఖ దర్శక,నటుడు ఎస్‌జె. సూర్య. నేచురల్ స్టార్ నాని హీరోగా, ఆయన కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా SJ సూర్య మాట్లాడుతూ.. “సరిపోదా శనివారం చాలా మంచి మూవీ. వివేక్ రచన భిన్నమైంది. ఆయన చెన్నైకి వచ్చి నాకు కథ చెప్పారు. ఆయన నెరేషన్ విన్నాక చాలా ఆనందం కలిగింది. ఇటువంటి రచయితలను అరుదుగా చూస్తుంటాం. ఒకరకమైన యాక్షన్ సినిమాను విభిన్నంగా వివేక్ మలిచారు. అన్ని యాక్షన్ సినిమాలు ‘మాణిక్ బాషా’ కాన్సెప్ట్ లోనే వుంటాయి. ఈవెన్ బాహుబలి 2, ఇంద్ర సినిమాల్లో కూడా మాణిక్ బాషా కాన్సెప్ట్ వుంది” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అలాంటి తరహా సినిమాలకు కొత్త తరహా యాక్షన్ వివేక్ ఆత్రేయ తీసుకువచ్చారు. విషయం ఏమంటే.. సినిమాలో నాని తల్లి కొడుకును యాంగ్రీ వుండకూడదు అని ప్రామిస్ తీసుకుంటుంది. అందుకే శనివారం అని ఫిక్స్ చేశారు. మిగిలిన రోజుల్లో మానిక్‌గా వుండే నాని శనివారం బాషాగా మారతాడు. ఇటువంటి కాన్సెప్ట్ మరీ మరీ చూసేవిధంగా వుంటుంది. ఇక కానిస్టేబుల్‌గా ప్రియాంక అందంతోపాటు నటనను కనబరిచారు” అని చెప్పారు.
అలాగే, “ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా అన్ని శనివారం నాడు కొన్ని మ్యాజిక్‌లు జరిగాయి. నాది, నాని, సాయికుమార్ లతోపాటు అందరి పుట్టినరోజులు శనివారమే వచ్చాయి. ఇది నిజంగా ఒక వండర్. నాని చాలా మంచి మనిషి, నటుడు. విజన్ వున్న నటుడు. సినిమాలపై తపన వుంది. అసిస్టెంట్ దర్శకుడి నుంచి ఈ స్థాయికి చేరారంటే ఆయన కష్టమే ఫలించింది. నేను ఇందులో డబ్బింగ్ పర్‌ఫెక్ట్‌గా చెప్పాను. వివేక్ గారు చాలా ట్రిక్కీగా పాత్రలను డిజైన్ చేశాడు. అలా నా పాత్ర దయాను మలిచారు: అని తెలిపారు నటుడు సూర్య.
కాగా సరిపోదా శనివారం చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్, సాయి కుమార్, అజయ్, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: