విలక్షణ నటుడు రావు రమేష్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం.లిమిటెడ్ బడ్జెట్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.34కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.టాక్ బాగుండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా టార్గెట్ ను పూర్తి చేసుకుంది.ఇదే జోరు కొనసాగిస్తే ఈవారంలో బ్రేక్ ఈవెన్ కానుంది.అయితే ప్రస్తుతం ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మరో రెండు చిన్న సినిమాలతో భారీ పోటీ ఎదుర్కొంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా కన్నా ముందు విడుదలైన కమిటీ కుర్రోళ్ళు,ఆయ్ సినిమాలు కూడా సూపర్ టాక్ తెచ్చుకోవడంతో ఇవి కూడా అదరగొడుతున్నాయి.లేకపోతే మారుతీనగర్ సుబ్రమణ్యం ఇంకాస్త ఎక్కువగానే రాబట్టుకునేదే.ఇక ఈగురువారం న్యాచురల్ స్టార్ నాని నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం రిలీజ్ కానుంది.మరి ఈసినిమా వచ్చాక మారుతీనగర్ సుబ్రమణ్యం ఎలాంటి రన్ కొనసాగిస్తుందో చూడాలి.
ఈసినిమాను లక్షణ్ కార్య డైరెక్ట్ చేయగా ఇంద్రజ,అంకిత్ కొయ్య కీలక పాత్రల్లో నటించారు.కళ్యాణ్ నాయక్ సంగీతం అందించాడు.ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ ప్రజెంటర్ గా వ్యవహరించారు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను రిలీజ్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: