నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ వుండదు – డివివి దానయ్య

Saripodhaa Sanivaaram Producer DVV Danayya Praises Natural Star Nani

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సహా ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో ఇటీవల చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మరోవైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ అందించింది. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు అని హీరో నాని స్వయంగా వెల్లడించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ, సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ అవుతుంది. నానిగారు కథల ఎంపికలో బెస్ట్. కథ నచ్చితే కొత్త దర్శకుడయినా అవకాశం ఇస్తారు. నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ వుండదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు నాని. అదేవిధంగా ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు. నాని ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవాలి” అని ఆకాంక్షించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఎస్.జె. సూర్య నటనలో ఇరగదీశారనే చెప్పాలి. నా తర్వాత సినిమాలో కూడా ఆయనే చేయాలని కోరుకుంటున్నా. ప్రియాంక అద్భుతంగా నటించారు. అభిరామిగారు ఈ సినిమాలో తల్లిగా చేశారు. దర్శకుడు ఏడాదిపాటు కథ రాశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. వివేక్ సినిమా అంటే.. అంటే సుందరానికి లాంటిది తీస్తాడేమోనని అనుకున్నాను. కానీ మంచి సినిమా తీశాడు. పెద్ద దర్శకుడు కోవలో చేరతారు. ఈ సినిమా విడుదలయ్యాక సక్సెస్ మీట్ లో కలుద్దాం” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.