మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత ఓటిటిల్లోకి వస్తుండడం విశేషం.దక్షిణాది భాషల్లో అమెజాన్ ప్రైమ్ ఈనెల 22నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుండగా అదే రోజున హిందీ లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది.ఇక థియేట్రికల్ రన్ విషయానికి వస్తే 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి 50డేస్ కంప్లీట్ చేసుకుంది.ఈఏడాది ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది కల్కి.
భారీ విఎఫ్ఎక్స్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె కీలక పాత్రల్లో నటించగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మించింది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వుంది.
ఇక కల్కితో వరసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్.గత ఏడాది చివర్లో వచ్చిన సలార్ పార్ట్ 1 సూపర్ హిట్ అనిపించుకుంది.ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ లో నటిస్తున్నాడు.మారుతి డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.తమన్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.మరి ఈ సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























