జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వస్తున్న సినిమా వెట్టైయాన్. ఈసినిమాలో రజనీ కాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీరస్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అంతేకాదు ఇప్పటికే రజనీ కాంత్ తన పార్ట్ వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నట్టు చిత్రయూనిట్ తెలియచేసింది. ఇక మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నారు. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి ఈసినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు చిత్రబృందం. ఈనేపథ్యంలోనే తాజాగా మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రితిక సింగ్ కూడా తన డబ్బింగ్ ను మొదలుపెట్టినట్టు తెలియచేస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, అభిరామి కూడా తమ పాత్రల డబ్బింగ్ ను పూర్తి చేయనున్నట్టు సమాచారం.
కాగా యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో ఇంకా మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, జీఎం సుందర్, రోహిణి, రావు రమేష్ పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబస్కరన్ నిర్మిస్తున్న ఈసినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: