ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Announces His Next Pan-India Mythological Project Indraputra

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ మైథాలజీ, ఫాంటసీ, యాక్షన్ డ్రామా అంశాలతో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి ‘ఇంద్రపుత్ర’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

భారతీయ చలనచిత్ర రంగానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన జీ స్టూడియోస్ , ప్రసిద్ధ నిర్మాత ప్రేరణా అరోరా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ పుప్పాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

భారతీయ ఇతిహాసాల్లోని ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరాటం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఒక విస్తృతమైన ‘మైథలాజికల్ యూనివర్స్’లో మొదటి అధ్యాయంగా రాబోతోంది. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలకు భిన్నంగా, శారీరకంగా మరియు మానసికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న పవర్‌ఫుల్ అవతార్‌లో అలరించనున్నట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు.2027లో ఈసినిమా విడుదలకానుంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రం అక్టోబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది.’క’, ‘కె-ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రాలతో విజయాలను నమోదు చేసుకున్న కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై పరిశ్రమలో విశేష ఆసక్తి నెలకొంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.