యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైడెట్ సినిమా దేవర. ఈసినిమాలో హీరోయిన్ గా అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి అయిన జాన్వీ కపూర్ నటిస్తుంది. దీంతో ఈసినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది. వీరిద్దరిని స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రబృందం షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈసాంగ్ సోషల్ మీడియా వేదికగా ఏ రేంజ్ లో దూసుకుపోయిందో చూశాం. ఇప్పుడు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈపాటకు సంబంధించిన అప్ డేట్లు రెండు రోజుల నుండి ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలు అయ్యాయి. ఇప్పుడు తాజాగా సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చుట్టమల్లే అంటూ వచ్చే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాసిన ఈ పాటను శిల్పా రావు ఆలపించారు. చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు కాసేపు ఊరికే ఉండదు అంటూ వస్తున్న ఈ సాంగ్ అయితే ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా విజువల్స్.. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటున్నాయి.
కాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా రాగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: