నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తంగలాన్ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్‍గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సహా టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, ‘బేబి’ ఫేమ్ సాయి రాజేశ్, సీనియర్ ప్రొడ్యూసర్ దామోదర ప్రసాద్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో చియాన్ విక్రమ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. విక్రమ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “మీరు చూపిస్తున్న ఎనర్జీ, క్రేజ్ బంగారంలా అనిపిస్తోంది. తెలుగు సినీప్రియులు ఎంతో ప్రత్యేకం. మాకు మీ సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తంగలాన్ టీజర్, ట్రైలర్ మీకు బాగా నచ్చాయని ఆశిస్తున్నా. మా ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్స్. మీరు నా గురించి, మా తంగలాన్ సినిమా చెప్పిన ప్రోత్సాహాన్నిచ్చే మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి.”
“వెయ్యేళ్ల క్రితం జరిగిన కథతో తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఆదిత్య కరికాలన్‌గా నటించా. ఇప్పుడు తీసిన తంగలాన్ వందేళ్ల క్రితం జరిగిన కథ. ఇదొక బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ. డైరెక్టర్ రంజిత్ తన ఆర్ట్ ఫామ్‌లో అందంగా రూపొందించాడు. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఈ స్టేజీ మీద నా సినిమాల్లోని పర్‌ఫార్మెన్స్‌లు చూపించారు. అవన్నీ చూసినప్పుడు ఎమోషన్ అయ్యాను. ఇవన్నీ నేనే చేశానా అనిపించింది. ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే స్ఫూర్తి కలిగింది.”
“పా రంజిత్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. ఆయనతో కలిసి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుుకుంటున్నా. ఎందుకో గానీ కుదరలేదు. తంగలాన్ గురించి ఆయన చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. మీకు సర్‌ప్రైజ్‌గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఈ సినిమాలో అడ్వెంచర్, మెసేజ్, మ్యాజిక్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా.”
“నిర్మాత జ్ఞానవేల్ రాజా గారు మాకు ఫుల్ లిబర్టీ ఇచ్చి మూవీ ప్రొడ్యూస్ చేశారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. జ్ఞానవేల్ రాజా గారు దీనిని పాన్ ఇండియా కాదు, వరల్డ్ స్టేజీ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఈ కంటెంట్‌తో కనెక్ట్ అవుతారు. పార్వతీ, మాళవిక చాలా బాగా పర్‌ఫార్మ్ చేశారు. మీరు తంగలాన్‌కు చూపిస్తున్న రెస్పాన్స్‌కు థ్యాంక్స్. ఈ నెల 15న థియేటర్స్‌లో కలుద్దాం” అని అన్నారు హీరో విక్రమ్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: