తంగలాన్ ఆర్డినరీ మూవీ కాదు – పా రంజిత్

Thangalaan is Not an Ordinary Movie, Says Director Pa Ranjith

కోలీవుడ్ విలక్షణ నటుడు, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప‌శుప‌తి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తంగలాన్ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్‍గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సహా టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, ‘బేబి’ ఫేమ్ సాయి రాజేశ్, సీనియర్ ప్రొడ్యూసర్ దామోదర ప్రసాద్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ.. “సినిమా మాధ్యమం ద్వారా నేను చూపించే నా ఆలోచనలను, దృక్పథాలను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. మన దేశంలో అణిచివేత, అసమానత్వం ఇంకా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా మన సమాజంలో ఉండిపోయాయి. వీటిని ఎదుర్కొనేందుకు నేను సినిమా మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తంగలాన్ ఈవెంట్ కోసం హైదరాబాద్ రావడం సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలను ఎంతో ఆదరించారు. ఈ సినిమా కూడా ఇష్టపడతారని కోరుకుంటున్నా” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తంగలాన్ ఆర్డినరీ మూవీ కాదు. ఇండిపెండెన్స్ కు ముందు జరిగిన ఒక చారిత్రక ఘటనకు తెరరూపమిస్తున్నాం. ఈ కథ బంగారం కోసం జరిగే వేట కాదు, స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం జరిగే పోరాటం. విక్రమ్ గారు తంగలాన్ కథను, ఆ పాత్రను, అందులోని భావోద్వేగాలను అర్థం చేసుకుని నటించారు. విక్రమ్ లాంటి నటుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారు ఎంతో సపోర్ట్ చేశారు. బిగ్ సక్సెస్ వస్తుందనే నమ్మకం ఉంది. మంచి సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కుతున్న ట్రెండ్‌లో ఉన్నాం. తంగలాన్ కూడా అలాగే ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నా” అని తెలిపారు దర్శకుడు పా రంజిత్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.