పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీలపై టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ అందించారు. పవన్ కళ్యాణ్ హీరోగా పలు చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు ఉన్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీంతో ఈ హీరోల ఫ్యాన్స్ ఆ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తమన్ తాజాగా ఈ చిత్రాలకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్ అందించాడు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్టులు పెట్టాడు. ఓజీ దర్శకుడితో మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలో అతి త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలిపాడు. ఇక రాజా సాబ్ నుండి ఫస్ట్ సింగిల్ జనవరిలో రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించాడు. అయితే, దీనికన్నా ముందు ఓజీతో అభిమానులను కలుస్తానని ప్రామిస్ చేశాడు. ఇక ఈ అప్‌డేట్స్ తెలియడంతో పవన్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం తమన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కిక్ శ్యామ్, వెంకట్ బచ్చు, అజయ్ ఘోష్, మొట్ట రాజేందర్, జీవా, హరీష్ ఉత్తమన్, శాన్ కక్కర్, అభిమన్యు సింగ్, కుమనన్ సేతురామన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఇక రాజా సాబ్ విషయానికొస్తే.. దర్శకుడు మారుతి దీనిని రొమాంటిక్ హారర్ జానర్‌లో రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ ఇప్పటిదాకా చేయని పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: