కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్‌గా తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరుతిరువోతు, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ ట్రైబల్ లీడర్‌గా సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. మరోవైపు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తంగలాన్ నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. వార్ సాంగ్ తెలుగు లిరికల్ వీడియో విడుదలైంది. ఇందులో విక్రమ్ పెర్ఫామెన్స్ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇక ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శరత్ సంతోష్ ఆలపించారు. కాగా జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. తంగలాన్ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మేకర్స్ విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: