డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

double ismart movie trailer release date fixed

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో నుండి వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇక రామ్ కు హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నాడు. అయితే ఈసారి వచ్చేది డబుల్ ఇస్మార్ట్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంతోపాటు హిట్ పడే అవకాశమే ఉందంటున్నారు. ఎందుకంటే ఈసినిమా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా రావడమే. మరోవైపు ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోపక్క బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్లు ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈరోజు ఉదయం ఒక అప్ డేట్ ను ఇచ్చారు. రామ్ తన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ అప్ డేట్ తో వచ్చారు. ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. మామ శంకర్ గాడి మెంటల్ మాస్ కి రెడీ అయిపోండి అంటూ ఆగష్ట్ 4వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగష్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.