దళపతి విజయ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమా భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 5 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా నుండి ఎప్పటికప్పుడు అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు. విజిల్ పొడు, చిన్న చిన్న కంగల్ అనే పాటలను రిలీజ్ చేశారు. రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు థర్డ్ సింగిల్ అప్ డేట్ వచ్చేసింది. అతి త్వరలోనే మూడో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. తన ట్విట్టర్ ద్వారా నెక్స్ట్ అప్డేట్ థర్డ్ సింగిల్ అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఈసాంగ్ రిలీజ్ డేట్ మాత్రం ఎప్పుడో చెప్పలేదు. త్వరలో ఆ అప్ డేట్ కూడా ఇవ్వనున్నారు.
కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























