జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.ఇక త్వరలోనే ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారు.షూటింగ్ విషయానికి వస్తే నిన్నటితో ఈసినిమా శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఈ లాంగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.సినిమాలో ఈ సీన్స్ హైలైట్ అవ్వనున్నాయట. ఈ షెడ్యూల్ తో 60శాతం షూటింగ్ పూర్తయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం కొంచెం బ్రేక్ తీసుకొని కేరళ, గోవా లలో నెక్స్ట్ షెడ్యూల్ లను ప్లాన్ చేస్తున్నారు.ఈ షెడ్యూల్స్ తో సినిమా దాదాపుగా కంప్లీట్ అయ్యినట్లే.గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానుంది.
ఇక ఈసినిమా కాకుండా విజయ్ చేతిలో ప్రస్తుతం మరో రెండు సినిమాలు వున్నాయి.అందులో రవి కిరణ్ కోలా తో ఓ సినిమా చేయనుండగా రాహుల్ సంకృత్యాన్ తో మరో సినిమా చేయనున్నాడు.విజయ్ ఈ రెండు సినిమాల షూటింగ్ లను బ్యాలెన్స్ చేయనున్నాడు.ఇవి కూడా వచ్చే ఏడాదే విడుదలయ్యే ఛాన్స్ వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























