టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా ఈ సినిమా నుండి రిలీజైన పలు పోస్టర్లు, టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాగే ఇటీవలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండటంతో న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మంచి బజ్‌నే క్రియేట్ చేసింది.
ఇక ఇదిలావుంటే, తాజాగా శివం భజే సెన్సార్ పూర్తి చేసుకుంది. టోటల్ రన్ టైమ్ 2 గంటల 6 నిమిషాల నిడివి ఉన్నట్టు చిత్ర బృందం తెలియజేసింది. అలాగే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. పాటలు, ట్రైలర్ మరియు ఇతర వాణిజ్య అంశాల వల్ల మార్కెట్ లో మంచి బజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు మేకర్స్. న్యూ ఏజ్ కథ-కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోయే ఈ చిత్రంలో వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































