టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరసరాయ డా. నరేష్ వీకే ప్రధానపాత్రలో నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బి. బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 14న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ పాల్గొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నరేష్ సన్నిహితురాలు, ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ఈ టీజర్‌ని లాంచ్ చేయడం విశేషం. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో యాక్ట్రెస్ పవిత్ర లొకేష్ మాట్లాడుతూ.. “రామోజీరావు గారు గ్రేట్ విజనరీ. ఆయన సేవలు మరువలేనివి. గ్రేట్ విజన్ తో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఈటీవీతో నాకు ఎంతో అనుబంధం వుంది. ఈటీవీ విన్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. నరేష్ గారు గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ప్రతి పాత్రకు ఆయన చేసే హోం వర్క్ చాలా ఇంట్రస్టింగ్‍గా వుంటుంది. టీజర్ చాలా ఎక్సయిటింగ్‍గా వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
కాగా వీరాంజనేయులు అస్థికల చెంబుకు బ్రహ్మానందం చెప్పిన వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్ హిలేరియస్‌గా వుంది. కుటుంబమంతా కలిసి చూసే పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ అనురాగ్ ఈ చిత్రాన్ని మలిచారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. ఇక నరేష్ కామెడీ టైమింగ్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రియా వడ్లమాని, రాగ్ మయూర్ పాత్రలు కూడా ఆసక్తికరంగా వున్నాయి. మ్యూజిక్, విజువల్స్ వున్నత స్థాయిలో వున్నాయి. మొత్తనికి టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: