మాస్ మహారాజ రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘సితార్’ పాట క్లాసికల్ అనిపించుకోగా, సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్’ మాస్ బీట్‍తో అలరించింది. ఈ రెండు పాటల్లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదరడంతో మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ అందింది. ఈ మూవీ టీజర్ జూలై 28న, అంటే రేపు ఆదివారం ఉదయం విడుదలకానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంట కనువిందు చేస్తోంది. కాగా మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























