వచ్చే నెల ఆగష్ట్ లో పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సరిపోదా శనివారం సినిమా కూడా ఒకటి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కు సామాన్యమైన వ్యక్తికి మధ్య జరిగే పోరాటంగా వస్తున్నట్టు అర్థమవుతుంది. ఆగష్ట్ 29వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన పాత్రలన ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే నాని పోస్టర్లు, హీరోయిన్ ప్రియాంక మోహన్ పోస్టర్ ను అలానే అభిరామి ఫస్ట్ లుక్ పోస్టర్లను ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో కీలక పాత్రకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమాలో సాయి కుమార్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈనేపథ్యంలో నేడు సాయి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో శంకరం అనే పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు.. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈసినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: