డబుల్ ఇస్మార్ట్- సంజయ్ దత్ డబ్బింగ్ కంప్లీట్

sanjay dutt completed his dubbing for double ismart movie

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్‌. ఆగష్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటిసారి తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం సంజయ్ దత్ తన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. సంజయ్ దత్ తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పగా.. తన వాయిస్ ని అందించడం ద్వారా అతని క్యారెక్టర్, మూవీకి పవర్ ఇచ్చారని అంటున్నారు.

కాగా ఈసినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.