అక్కినేని నాగార్జున సమర్పణలో, స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన కొత్త బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’పై నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ఇట్లు అర్జున’ (నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనీష్ హీరోగా, అనస్వర రాజన్ కథానాయికగా నటించారు. కాగా సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే, అంటే రేపు (నవంబర్ 12) రాత్రి తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించేందుకు చిత్రబృందం నిర్ణయించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథాంశం మరియు అవుట్‌పుట్‌పై ఉన్న అపారమైన నమ్మకంతోనే మేకర్స్ సినిమాను విడుదలకు ముందే ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ (U/A) సర్టిఫికెట్ లభించడం సాంగ్స్ ,ట్రైలర్ కు ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ ప్రీమియర్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ఈ షోస్ కి ఇండస్ట్రీ నుండి సెలెబ్రెటీలు కూడా హాజరుకానున్నారు.
మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేయడం, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కింగ్ నాగార్జున, అఖిల్ అక్కినేని మ్యూజికల్ ఈవెంట్‌కు హాజరై ప్రమోషన్లలో పాల్గొనడంతో సినిమాపై బజ్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ఎస్. తమన్ అందించిన చార్ట్‌బస్టర్ పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలవడం ఈ ప్రీమియర్లకు మరింత ప్లస్ అయింది. పెయిడ్ ప్రీమియర్లతోనే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ సాధించి, నవంబర్ 13న ఘనమైన ఓపెనింగ్స్ సాధించాలని చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























