రణ్‌బీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర తిరగరాస్తోంది. సోమవారం రోజున ఆల్-టైమ్ హయ్యెస్ట్ సింగిల్ డే వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఆరవ రోజైన మంగళవారం కూడా అదే ఊపును కొనసాగించి బిగ్గెస్ట్-ఎవర్ ట్యూస్‌డే కలెక్షన్లను నమోదు చేసింది. గుజరాతీ నూతన సంవత్సరం మరియు దీపావళి సెలవుల కలిసి రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం హిందీ వెర్షన్ వసూళ్లను పరిశీలిస్తే, మొదటి రోజు గురువారం రూ. 47 కోట్లు, శుక్రవారం రూ. 38.25 కోట్లు, శనివారం రూ. 53 కోట్లు, ఆదివారం రూ. 37 కోట్లు, సోమవారం రూ. 95 కోట్లు సాధించగా, ఆరవ రోజైన మంగళవారం ఏకంగా రూ. 75.03 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో ఒక్క హిందీ వెర్షన్ నెట్ వసూళ్లే రూ. 345.28 కోట్లకు చేరుకున్నాయి. నేడు బుధవారం ‘భాయ్ దూజ్’ ఈ వారాంతంలో ఒక్క హిందీ వెర్షన్ నెట్ కలెక్షన్లే 500 కోట్ల మార్కును అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు మరియు ఓవర్సీస్ మార్కెట్లను కలుపుకుని చూస్తే, ‘రామాయణం’ పార్ట్-1 చిత్రం కేవలం 6 రోజుల్లోనే ఏకంగా రూ. 800 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. రోజురోజుకూ ఊపందుకుంటున్న ఈ రికార్డు స్థాయి కలెక్షన్లు చూస్తుంటే, అతి త్వరలోనే ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























