ఇట్లు అర్జున చూసి సర్‌ప్రైజ్ అయ్యాను – నాగార్జున

Nagarjuna Impressed and Surprised by Itllu Arjuna

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ఎస్ తమన్ అందించిన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. కొత్తదనాన్ని ఎప్పుడూ ఆహ్వానించే తెలుగు సినిమా ప్రేక్షకులకు థాంక్యూ. ఈ వేడుకకు వచ్చిన రామ్ చరణ్‌కి థాంక్యూ. తను చాలా హంబుల్ పర్శన్. మా పెద్దబ్బాయి తారక్ ఇక్కడికి రాలేకపోయాడు. తనుఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశాడు. థాంక్యూ తారక్. అనీష్ గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ చేయమని అడిగాడు. తన సినిమాలో మూగవాడిగా నటిస్తున్నాడు. తొలి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం అవసరమా అని అడిగాను. రామ్ చరణ్ ఒక చెవిటి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టింది. అఖిల్ ఆరో సినిమాకు బ్లైండ్ క్యారెక్టర్ చేశాడు. అయితే ‘ఇట్లు అర్జున’ కథ మీద అనీష్‌కు చాలా నమ్మకం ఉంది. నాకు సినిమా చూపించారు.

సినిమా చూసి చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. అనీష్ అద్భుతంగా తన పాత్రలో లీనమైపోయాడు. సినిమా చాలా బాగుంది. తన కళ్లతో మాట్లాడాడు. తన సైలెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే తమన్ ఇచ్చిన ప్రతి పాట హిట్ అయింది. నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనీష్ ప్రేమ మీ అందరికీ వినిపిస్తుంది. ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం చాలా గర్వంగా ఉంది. సినిమా విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ సో మచ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.