పవన్, బన్నీ సినిమాలపై అనసూయ అప్‌డేట్స్

Actress Anasuya Gives Interesting Updates on Hari Hara Veera Mallu and Pushpa 2

టాలీవుడ్ సీనియర్ నటుడు జ‌గ‌ప‌తిబాబు, యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం సింబా. ముర‌ళి మ‌నోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సంప‌త్ నంది, రాజేంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌ష్టు 09న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ వేడుక‌ను మేక‌ర్స్ నిర్వ‌హించ‌గా నటి అనసూయ పాల్గొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంద‌ర్బంగా అనసూయ రెండు బిగ్ అప్‌డేట్స్ అందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తోన్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. హరిహర వీరమల్లులో ఉప ముఖ్యమంత్రితో కలిసి పాటకు డాన్స్ చేయడం అద్భుతమైన అనుభూతి అని పేర్కొంది అనసూయ. ఈ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్ అని, దీనికోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.

అలాగే పుష్ప 2లో తన పాత్రకు సంబంధించి షూటింగ్ అప్‌డేట్‌ గురించి ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె తెలివిగా బదులిచ్చారు. ఈ విషయం ఇలా బయటకు చెప్పొచ్చో, లేదో తనకు తెలియదని చెప్పారు. ‘నాకు భయం, ఒకవేళ నేను దీని గురించి ఏదయినా చెప్తే.. మా సార్ నుంచి నాకు చివాట్లు పడతాయి’ అని డైరెక్టర్ సుకుమార్‌ని ఉద్దేశించి అనసూయ అన్నారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

కాగా అనసూయ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తోంది. వీటిలో ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలు కూడా ఉన్నాయి. పుష్ప ఫస్ట్ పార్టులో స్మగ్లింగ్ సిండికేట్ కింగ్‍పిన్ మంగళం శ్రీను (సునీల్) భార్యగా కనిపించిన విషయం తెలిసిందే. అందులో ఫుల్ మాస్ క్యారక్టర్‌లో ఇరగదీసిన అనసూయ పాత్రకు సీక్వెల్‌లో మరింత స్కోప్ ఉండనుందని తెలుస్తోంది. ఇక హరిహర వీరమల్లు సినిమాలో పవన్ సరసన ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.