భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలోఇరు కుటుంబాల సాక్షిగా అనంత్, రాధికా మర్చంట్‍ను పరిణయమాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ హీరోలు పాల్గొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ సతిసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితోపాటు అక్కినేని అఖిల్ ఈ కార్యక్రమంలో తళుక్కున మెరిశాడు. ఈ సందర్భంగా అఖిల్ మీడియా పాయింట్ వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు.
కాగా జూలై 12-14 తేదీలలో మూడు రోజులపాటు వీరి కళ్యాణ వేడుకలు ఈ వివాహ వేడుకలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా నిన్న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’ జరుగగా.. శనివారం ‘శుభ్ ఆశీర్వాద్’, ఆదివారం ‘మంగళ్ ఉత్సవ్’ నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటీ,నటులతోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























