ఇరుముడి ట్రైలర్ రానుంది

Trailer Release on the Way for Irumudi

మాస్ మహారాజా రవితేజ, విజనరీ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. “కుటుంబమే సర్వస్వం అయినప్పుడు, వారి కోసం ఒక వ్యక్తి ఏదైనా చేస్తాడు” అనే సెంటిమెంట్ అండ్ పవర్‌ఫుల్ లైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఆఫీషియల్ ట్రైలర్‌ను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించబోయే గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు.

ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ‘మజిలీ’, ‘నిన్ను కోరి’, ‘ఖుషి’ వంటి ఫీల్ గుడ్ హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ మాస్ మహారాజాని సరికొత్త రస్టిక్ అండ్ ఎమోషనల్ అవతారంలో చూపిస్తున్నారు.రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్, T-సిరీస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు , పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను పెంచగా, భీమవరంలో జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో అంచనాలు మరింత పీక్స్‌కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.