పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా కల్కి 1,000 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యింది.
ఈ నేపథ్యంలో కల్కి చిత్రంలో కీలక రోల్ ప్లే చేసిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ దీనిపై స్పందించారు. ఇప్పటికే దర్శకుడు నాగిపై ప్రశంసలు కురిపించిన ఆయన ఇప్పుడు కల్కి సాధించిన రికార్డుపై సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు. ‘షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాను కల్కి కేవలం 15 రోజుల్లో క్రాస్ చేసింది అంటే, అమేజింగ్’ అని పేర్కొన్నారు. కాగా కల్కిలో అమితాబ్ పోషించిన అశ్వత్థామ పాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో కల్కి మూవీ ఘనవిజయంపై ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























