జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన సినిమా హరోం హర. ఈసినిమా డిఫరెంట్ కథతో.. కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమాను రూపొందించారు. భారీ అంచనాల మధ్య జూన్ 14న థియేటర్లలో రిలీజైను ఈసినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ నే అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను రెండు ఓటీటీ సంస్థలు దక్కించుకున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వారు అలానే ఈటీవీ విన్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు జులై 11 నుంచి హరోంహర సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఆ రోజు విడుదల కాలేదు. ఇక ఇప్పుడు మరో కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాని ఈటీవీ విన్ వారు జూలై 18 న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. మరి ఆహాలో ఎప్పుడు రిలీజ్ కు వస్తుందో చూడాలి.
కాగా ఈసినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, రవి కాలే, రాజశేఖర్ అనింగి, కేషల్ దీపక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























