గత కొన్ని నెలలుగా తమిళంలో పెద్ద సినిమాల విడుదలేక థియేటర్లు వెలవెల బోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన మీడియం బడ్జెట్ మూవీ మహారాజ బాక్సాఫీస్ వద్ద సందడి చేసి రిలీఫ్ ఇచ్చింది. అయితే ఇక నుంచి మాత్రం పెద్ద సినిమాలు క్యూ కట్టనున్నాయి.నెలకు ఒకటి, రెండు సినిమాలు థియేటర్లోకి రానున్నాయి.అందులో మొదటగా శంకర్-కమల్ హాసన్ ల ఇండియన్ 2 విడుదలవుతుంది.ఇండియన్ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఈనెల 12న రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా తరువాత ఇదే నెలలో ధనుష్ ,రాయన్ విడుదలకానుంది.ఈసినిమాను ధనుషే డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాపై కూడా మంచి అంచనాలు వున్నాయి.సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.అదే రోజున రాయన్ తెలుగులో కూడా విడుదలకానుంది.
ఇక ఆగస్టు లో మచ్ అవైటెడ్ తంగలాన్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.ఇప్పటికే ఆర్ ఆర్ కూడా కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్ ను విడుదలచేయనున్నారు.పా రంజిత్ డైరెక్ట్ చేస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.
ఆ తరువాత సెప్టెంబర్ లో శివకార్తికేయన్ అమరన్ విడుదలకానుంది.కమల్ హాసన్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.ఇక అక్టోబర్ లో మచ్ అవైటెడ్ కంగువా రిలీజ్ కానుంది.కంగువాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.నవంబర్ లో విజయ్ గోట్,అజిత్ విడా ముయార్చి రానున్నాయి.త్వరలోనే ఈరెండు సినిమాల రిలీజ్ డేట్ లను ప్రకటించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























