జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం తను టైసన్ నాయుడుగా వస్తున్నాడు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈసినిమాకు సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా బెల్లంకొండ శ్రీనివాస్ తన 11వ సినిమాను కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. శ్రీరామనవమి పండుగా సందర్భంగా ఈసినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో హార్రర్ మిస్టరీ గా ఈసినిమా రాబోతుంది. పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమాను నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. లాంచ్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై డైనమిక్ నిర్మాత సాహు గారపాటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రాఫర్ కాగా, కాంతారా ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిటర్ గా చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























