డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొడ్యూసర్ దిల్ రాజు

Producer Dil Raju Meets AP Deputy CM Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ను టాలీవుడ్‌ అగ్ర నిర్మాత ప్రొడ్యూసర్ దిల్ రాజు కలిశారు. సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల బృందంతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంతరం విజయవాడలోని క్యాంప్‌ ఆఫీసుకు చేరుకున్న పరిశ్రమ పెద్దలను పవన్ ఆత్మీయంగా తన ఛాంబర్‌లోకి ఆహ్వానించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దిల్ రాజు నేతృత్వంలోని నిర్మాతల బృందం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఇటీవలే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌ కూడా పాల్గొన్నారు. కుశలప్రశ్నల అనంతరం సినీపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై దిల్ రాజు సహా నిర్మాతల బృందం డిప్యూటీ సీఎంతో చర్చించారు.

ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసినవారిలో.. అల్లు అరవింద్‌, సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు, ఏ.ఎం.రత్నం, ఎస్‌.రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్‌, డీవీవీ దానయ్య, యార్లగడ్డ సుప్రియ, ఎన్వీప్రసాద్‌, బన్నీ వాస్‌, నవీన్‌ ఎర్నేని, సూర్యదేవర నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.