ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ తరువాత దాని సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఆగష్ట్ 15వ తేదీ నుండి పుష్ప సినిమా తప్పుకోవడంతో ఈ తేదీని డబుల్ ఇస్మార్ట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దాదాపు షూటింగ్ చివరి దశకు రాగా ఈసినిమా లాస్ట్ షెడ్యూల్ ను తాజాగా ప్రారంభించారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభించిన ఈ ఆఖరి షెడ్యూలో రెండు పాటలు చిత్రీకరణ జరపుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుండగా జులై నుండి పోస్ట్ ప్రొడొక్షన్ పనులను కంప్లీట్ చేయనున్నారు.
కాగా ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ అందిస్తున్నారు. మణిశర్మనే డబుల్ ఇస్మార్ట్‌కు కూడా సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























