ఫస్ట్ హీరోయిన్ తో డిప్యూటీ సీఎం

deputy cm pawan kalyan with his first heroine

మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు. పవన్ డిప్యూటీ సీఎంగా.. మంత్రిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి విజయవాడలోని క్యాంప్‌ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే కదా. సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో అశ్వినీ దత్, అల్లు అరవింద్, రాధాకృష్ణ, ఏఎం రత్నం, దిల్ రాజు, డీవీవీ దానయ్య, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, బన్నీవాసు తో పాటు పలువురు నిర్మాతలతో జరిగిన ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్థికి ఉన్న అవకాశాలు, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ది గురించి చర్చించినట్టు తెలుస్తుంది. ఈసందర్భంగా బయటకు వచ్చిన ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.

అయితే ఈఫొటోల్లో ఒక ఫొటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫొటో ఏదో కాదు.. పవన్ కళ్యాణ్ ఇంకా సుప్రియ ఫొటో. ఈ ఫొటో ప్రత్యేకత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.. ఇక అదే సినిమాతో సుప్రియ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమా తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ ఫొటోను ఫస్ట్ హీరోయిన్ తో పవన్ అంటూ ఫేర్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.