పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ-ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కల్కి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అయితే ఈ రిలీజ్ ట్రైలర్లో ఓ సర్ప్రైజింగ్ విషయం అభిమానుల దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఈ మూవీలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటిస్తుండగా.. ఇప్పుడు మరో ప్రముఖ హీరోయిన్ కూడా ఉన్నట్లు అర్ధమవుతోంది. తను మరెవరో కాదు.. మలయాళ స్టార్ హీరోయిన్ మాళవిక నాయర్. పలు మలయాళం సహా తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. కాగా ఆమె ఇందులో ఒక కీలక రోల్లో కనిపించనుంది. మాళవిక నాయర్ ఇంతకుముందు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ చిత్రాలలో కూడా నటించింది. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన డెవిల్ సినిమాలోనూ నటించింది.
దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా టాప్ చార్ట్‌లో వుంది. మరోవైపు కల్కి వరల్డ్ గురించి నాగ్ అశ్విన్ పలు ఆసక్తిక విషయాలు తెలియచేస్తూ ఎపిసోడ్స్ రూపంలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ విడుదల చేయగా.. మొదటిదానిలో కలియుగం, కల్కి అవతారం గురించి, రెండో ఎపిసోడ్లో మూడు ప్రపంచాలను పరిచయం చేశారు. కాగా కల్కి నుంచి వస్తున్న ఈ అప్డేట్స్ అన్నీ చిత్రంపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























