టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. భక్తిరస ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద విష్ణు తండ్రి, సీనియర్ నటుడు డా.మోహన్ బాబు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కన్నప్ప చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ..* ‘కన్నప్ప కేవలం సినిమా కాదు.. మన చరిత్ర. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించారు. ఇంకా ఇప్పటికీ ఆ పాత్రల్లోనే ఉండిపోయాం. చరిత్రను అందరూ మర్చిపోతున్నారు. మనం మన చరిత్రను చెప్పుకోవాలి. కన్నప్పను అందరూ వీక్షించాలి” అని కోరారు.
ఇక సీనియర్ నటి మధుబాల మాట్లాడుతూ.. “కన్నప్ప లాంటి ప్రాజెక్ట్‌లో నటించడం ఆనందంగా, గర్వంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్. విష్ణు మంచు గారికి మేకింగ్‌లో ఎంతో నాలెడ్జ్ ఉంది. విష్ణు లాంటి వారే ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ని తీయగలరు. ఓ మహాయజ్ఞంలో పాల్గొన్నట్టుగా అనిపించింది” అని అన్నారు.
అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ.. “కన్నప్పలో నాకు ఛాన్స్ ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి, ముఖేష్ సింగ్ గారికి థాంక్స్. ఈ సినిమాకు అందరూ ప్రాణం పెట్టి నటించారు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: