మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు. చాలా వరకూ షూటిింగ్ ను పూర్తి చేసుకున్నారు కూడా. పవన్ కల్యాణ్ ఎన్నికల కారణంగా బిజీ అవడంతో ఓజీ మూవీకి సంబంధించిన షూటింగ్కు చాలా బ్రేక్ వచ్చింది.
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈసినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. కానీ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ కోసం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి కారణం ఈ రిలీజ్ డేట్ లో మరో సినిమా రానుండటం. వస్తున్న వార్తల ప్రకారం దేవర సినిమాను అక్టోబర్ 10 నుండి సెప్టెంబర్ 27 కు వాయిదా వేయాలని చూస్తున్నారట. అంతేకాకుండా పవన్ కూడా ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారో తెలియదు.. దాంతో షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు.. ఈ కారణం చేత కూడా సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































