విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

Vishwak Sen's Mechanic Rocky All India Distribution Rights Acquired by Asian Suresh

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ స‌ర‌స‌న నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా న‌టించారు. మే 31న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక జూన్ 14న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో విశ్వక్‌ సేన్‌ తన తదుపరి సినిమాపై అప్పుడే దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. రవితేజ ముళ్లపూడి తొలిసారి దర్శకత్వం వహిస్తుండగా.. ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది.

అదేంటంటే..? ‘మెకానిక్‌ రాకీ’ ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఇక ఇదిలావుండగా విశ్వక్‌ సేన్‌ మరోవైపు రామ్ నారాయణ్‌ దర్శకత్వంలో #VS12 చిత్రంలో నటిస్తున్నాడు. ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని నిర్మించిన షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ దీనిని తెరకెక్కించనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.