విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా మొదలైన తన సినీ కెరీర్ ఇప్పుడు ఏ స్థాయికి చేరిందో చూస్తూనే ఉన్నాం. కెరీర్ స్టార్టింగ్ లోనే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా ఇలా సూపర్ హిట్లను అందుకోవడంతో విజయ్ దేవరకొండ క్రేజ్ పూర్తి మారిపోయింది. అయితే ఈమధ్య వరుసగా ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. గత ఏడాది వచ్చిన ఖుషి మాత్రమే కాస్త డీసెంట్ హిట్ ను అందించింది. మళ్లీ ఈఏడాది ఫ్యామిలీస్టార్ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా ఉంటుంది విజయ్ దేవరకొండ క్రేజ్. అది మరోసారి రుజువైంది. తాజాగా విజయ్ దేవరకొండ అమెరికాలో తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే అక్కడ విజయ్ దేవరకొండ ను చూసి ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు.. తనతో సెల్ఫీలకోసం పోటీపడ్డారు. దీంతో విజయ్ క్రేజ్ అమెరికాలో కూడా నెక్ట్స్ లెవల్ ఉందని అర్థమైంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇది విజయ్ 12వ సినిమా. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ స్పై గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనితో పాటు రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఈసినిమా తెరకెక్కుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























