యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తన సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఇక అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం కూడా ఫిక్స్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రెండు రోజుల నుండి హల్టీ వేడుకలు, సంగీత వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలు అవుతూనే ఉన్నాయి. ఇక నిన్న జూన్ 10 న చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఐశ్వర్య అర్జున్ సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు తమిళ కన్నడ సినిమాలలో హీరోయిన్ గా నటించారు. తెలుగులో కూడా హీరో విశ్వక్ తో కలిసి ఒక సినిమాకు కమిటీ అయ్యారు ఈ సినిమాకు తన తండ్రి అర్జున్ డైరెక్టర్ గా పని చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది. ఇక ఉమాపతి కూడా హీరోగా కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























