నటీనటులు : కాజల్,నవీన్ చంద్ర,ప్రకాష్ రాజ్, రవి వర్మ
ఎడిటింగ్ : కోదాటి పవన్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ : విష్ణు బేసి
సంగీతం :శ్రీ చరణ్ పాకాల
దర్శకత్వం : సుమన్ చిక్కాల
నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాస రావు తక్కలపెల్లి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ కాజల్ అగార్వల్ టైటిల్ రోల్ లో తెలుగులో చేసిన సినిమా సత్యభామ.ట్రైలర్ సినిమాపై అంచనాలను తీసుకొచ్చింది.గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈసినిమాకు స్క్రీన్ ప్లే ను అందించడం తోపాటు సమర్పకుడిగా వ్యవహరించాడు.ఇక ఈసినిమా ఈ రోజే థియేటర్లోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుంది.సత్యభామ మెప్పించిందా లేదా అనేది రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
సత్యభామ (కాజల్ అగర్వాల్) ఏసీపీ గా వుంటూ షీ టీం కు హెడ్ గా వ్యవహరిస్తుంటుంది.ఇన్వెస్టిగేషన్ చేయడంలో దిట్ట.ఎన్నో కేసులను అలవోకగా ఛేదిస్తుంది.పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సత్యభామ రచయిత అయిన నవీన్ చంద్ర ను వివాహం చేసుకుంటుంది అయితే ఫ్యామిలీ లైఫ్ కంటే డ్యూటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది.ఇక హసీనా అనే ఓ బాధితురాలు సత్యభామ దగ్గరికి వచ్చి తనకు జరుగుతున్న గృహహింస గురించి కంప్లైట్ చేస్తుంది.సత్యభామ ఆమెకు నేనున్నానని భరోసా ఇచ్చి పంపిస్తుంది అయితే కంప్లైంట్ చేసిన కొద్దీ రోజులకే హసీనా హత్యకు గురవుతుంది.దాంతో సత్యభామ మెంటల్ గా డిస్ట్రబ్ అవుతుంది.హసీనా కేసును పర్సనల్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది.ఈక్రమంలో హంతకుడు హసీనా తోపాటు మరికొందరి జీవితాలను కూడా నాశనం చేశాడని తెలుసుకుంటుంది.ఇంతకీ సత్యభామ ఆ హంతకుడిని ఎలా పట్టుకుంది ఈక్రమంలో తనకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్నదే మిగితా కథ.
విశ్లేషణ :
క్రైమ్ థ్రిల్లర్ లలో కథనాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే సినిమా అంత ఎక్కువ ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్విస్టులు ఈ రకమైన జోనర్ లో కీలక పాత్ర పోషిస్తాయి.ఇక ఇదే కేటగిరి లో వచ్చిన సత్యభామ లో కూడా ట్విస్టులు థ్రిల్ చేశాయి.కథనం కూడా రక్తికట్టించేలా ఉండడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.
నేరస్తుడిని ముందే చూపించి వాడిని పట్టుకునేందుకు సత్యభామకు ఎదురైనా సవాళ్లు ఆసక్తిగా వున్నాయి.ఎక్కువ టైం తీసుకోకుండా కథను మొదలు పెట్టాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కాజల్ ఎలివేషన్ సన్నివేశాలు మెప్పిస్తాయి.ఇంటర్వల్ ముందుకు వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ అంచనాలు పెంచేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ను ట్విస్టులతో ఎంగేజింగ్ గా చూపించడం లో డైరెక్ట్ సక్సెస్ అయ్యాడు.చివర్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అయ్యాయి. ఓవరాల్ గా చూస్తే ఈసత్యభామ మెప్పించింది అని చెప్పొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే సత్యభామ పాత్రలో కాజల్ అదరగొట్టింది.ఎనర్జిటిక్ యాక్టింగ్ తోపాటు తెర మీద గ్లామర్ గా కనిపించింది.ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా చేసింది.ఆమెకు సవాలు విసిరేది పాత్ర కాదు కానీ పోలీస్ ఆఫీసర్ గా మాత్రం కరెక్ట్ గా సెట్ అయ్యింది.కీలక పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర తన పాత్రకు న్యాయం చేశాడు. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,నాగినీడు,హర్షవర్ధన్ తమ అనుభవాన్ని చూపించారు.
టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా వుంది ఇలాంటి సినిమాలకు పాటలు అవసరం లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకం.ఈ విషయంలో శ్రీ చరణ్ పాకాల నిరాశపరచలేదు.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్స్ క్వాలిటీగా వున్నాయి.ఎడిటింగ్ ఒకే.నిర్మాతలు సినిమాకు బాగానే ఖర్చు చేశారు.
ఓవరాల్ గా కాజల్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సత్యభామలో కాజల్ నటన, ట్విస్టులు, క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఈసినిమా బాగా నచ్చుతుంది.పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళితే మిగితా వారికి కూడా ఈ సత్యభామ ఓకే అనిపిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: