టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘మనమే’ నేడు (శుక్రవారం,జూన్ 7) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయింది. ఈ క్రమంలో మేకర్స్ అంతకుముందు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్‌కు ‘ఛార్మింగ్ స్టార్’ టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్‍లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. శర్వా డార్లింగ్.. నిన్న గెలిచింది మనమే. రేపు గెలవబోయేది మనమే. శ్రీరామ్ ఆదిత్య చెప్పినట్లు ఒక పండగ వాతావరణం వుంది. నిన్నటి నుంచి కళ్యాణ్ గారి రీల్స్ చూస్తూనే వున్నాం. ప్రతి రీల్ లోనూ గూస్ బంప్స్ వస్తూనే వున్నాయి. ఇంకా ఆ వైబ్ లోనే వున్నాం. చాలా ఆనందంగా వుంది. రెండు తెలుగు రాష్ట్రాలు మంచి పాజిటివ్ వైబ్ లో హెల్తీ ఎట్మాస్పియర్ లో వున్నాం. ఈ సినిమాతో అది కంటిన్యూ అవుతుంది. ఫ్యామిలీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందనడంలో డౌట్ లేదు” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “శర్వా నా మహానుభావుడు. అందులో ఎంత ఫ్రెష్ గా అనిపించాడో మళ్ళీ ఇందులో అంత పాజిటివ్ వైబ్ వుంది. రోజు రోజుకి యంగ్ అవుతున్నాడు. తనతో కాలేజీ స్టొరీ తీయాలేమో. కృతి ఈ సినిమా ప్రొడ్యూసర్ గా పూర్తి భాద్యత తీసుకొని సినిమాని ఇంత గొప్పగా ప్రేక్షకులు మందుకు తీసుకురావడం ఆనందంగా వుంది. విశ్వ ప్రసాద్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఈ సినిమా అందరికీ చాలా పెద్ద ఫిల్మ్ అవుతుంది. ఆడియన్స్ మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మనమే తప్పకుండా ఆడియన్స్ నచ్చే సినిమా అవుతుంది. ఈ ఈవెంట్ కి వస్తున్నప్పుడు ప్రభాస్ గారితో మాట్లాడాను. ఆయన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పామని చెప్పారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: