బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన సినిమా బడే మియా చోటే మియా.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకుంది.రివ్యూస్ తోపాటు టాక్ కూడా నెగిటివ్ గా రావడంతో మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టుకోలేకపోయింది. అక్షయ్ కుమార్ ఈసినిమాతో కెరీర్ లో భారీ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే కేవలం హిందీ లోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.మరి థియేటర్లలో నిరాశపరిచిన ఈసినిమా ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలీ అబ్బాస్ జాఫర్ ఈ బడే మియా చోటే మియాను డైరెక్ట్ చేయగా పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషీ చిల్లర్, సోనాక్షి సిన్హా, రోనిత్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. విశాల్ మిశ్రా సంగీతం అందించగా పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: