యంగ్ హీరో విశ్వక్ సేన్ మూడు నెలల గ్యాప్ లో మరో హిట్ ను ఖాతాలో వేసుకోనున్నాడు. ఫిబ్రవరి లో గామి తో హిట్ కొట్టిన విశ్వక్ గత వారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వచ్చాడు.రివ్యూస్ ను లెక్కచేయకుండా ఈసినిమా 3రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 16.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మూడు రోజుల్లో 6.06కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.ఈరెండు రాష్ట్రాల్లో కలిపి ఈసినిమాకు 8కోట్ల బిజినెస్ జరుగగా ఇప్పటికే 82 శాతం రికవరీ అయ్యింది.ఈ వారంలో టార్గెట్ ను చేరుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూరల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.ఈసినిమా థియేట్రికల్ రన్ తరువాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.
ఇక విశ్వక్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు వున్నాయి. అందులో మెకానిక్ రాకీ ఒకటి కాగా మరొకటి లైలా.రామ్ నారాయణ్, లైలా ను డైరెక్ట్ చేయనుండగా ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.ఆకాంక్ష శర్మ ఫిమేల్ లీడ్ గా నటించనుంది.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.తనీష్క్ బాఘ్చి సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























