కమల్ హాసన్‌లో ప్రతీ అణువు నటిస్తుంటుంది – బ్రహ్మానందం

Indian 2 Audio Launch Event Brahmanandam Praises Kamal Haasan

లోకనాయకుడు కమల్ హాసన్‌ అద్భుతమైన నటుడని, ఆయనలోని ప్రతీ అణువు నటిస్తుంటుందని పేర్కొన్నారు టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ మేరకు ఆయన ఆదివారం చెన్నైలో జరిగిన ‘భార‌తీయుడు 2’ (ఇండియన్ 2) ఆడియో వేడుక‌లో పాల్గొని సందడి చేశారు. కాగా ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ దర్శకత్వం వహిస్తుండగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా న‌టిస్తుంది. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 12న తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ‘భార‌తీయుడు 2’ ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో శింబు, స్టార్ డైరెక్టర్స్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, ప్రొడ్యూసర్స్ ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కాగా ఈ వేడుకలో శృతి హాసన్, మౌనీ రాయ్, డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ ఎస్. శంకర్ గారు చాలా డెడికేటెడ్ పర్సన్. ఇప్పటికీ అదే డెడికేషన్, సిన్సియార్టీతో సినిమా తీశారు. ఇండియన్ సినిమా ఎంత బాగుంటుందో.. ఈ సీక్వెల్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కమల్ హాసన్ గారు ఎంత గొప్ప నటుడన్నది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనలోని ప్రతీ అణువు నటిస్తుంటుంది. ఆయనతో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఇండియన్ 2 పెద్ద విజయాన్ని సాధిస్తుంది” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.