హార్రర్ సినిమాలకు సీక్వెన్స్ రావడం అనేది కామన్. సినిమా హిట్ అయితే దానికి సీక్వెన్స్ తీస్తూనే ఉంటారు. ఆ సీక్వెన్స్ లో భాగంగానే ఈమధ్య వచ్చిన సినిమా అరణ్మనై 4. తెలుగులో ఈసినిమా బాక్ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో మొదలైంది ఈ ఫ్రాంచైజ్. ఇప్పటివరకూ మూడు సినిమాలు రాగా రీసెంట్ గా నాలుగో సినిమా అరణ్మనై వచ్చింది. మే 3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ పార్టనర్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ ను చిత్రయూనిట్ తాజాగా ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుందని తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
కాగా ఈసినిమాలో తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా.. కోవై సరళ, యోగిబాబు,రాజేంద్రన్ కీలకపాత్రల్లో కనిపించారు.హిప్ హాఫ్ తమిళ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































